Posts

Showing posts from July, 2021

Chanakya Neeti: ఈ నాలుగు వ్యక్తిత్వాలు గల వారికి మీ సంపాదన గురించి అస్సలు చెప్పొద్దు.. పొరపాటున చెప్పారో అంతే సంగతులు..!

డబ్బు సంపాదన మనిషి జీవితంలో ఎంతో కీలకం అనే విషయం తెలిసిందే. భూమిపై మనిషి మనుగడ సాగించాలంటే డబ్బు చాలా ముఖ్యం. ఈ సంగతిని ఆచార్య చాణక్య ఎప్పుడో చెప్పారు. సంపద జీవితానికి అత్యంత కీలకమని, దానిని నిజమైన స్నేహితుడిగా కాపాడుకోవాలని సూచించారు. డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చునని చెప్పారు. అయితే, సంపద గల వ్యక్తులు తమ సంపాదన గురించి గోప్యత పాటించాలని సూచించారు. ఎవరితో పడితే వారితో డబ్బు గురించి మాట్లాడొద్దన్నారు. ముఖ్యంగా కొన్ని వ్యక్తిత్వాలు కలిగిన వారితో సంపద గురించి షేర్ చేసుకోవద్దని చాణక్యుడు హితవు చెప్పారు. ఇదే విషయాన్ని ఆచార్య చాణక్య తన గ్రంథంలో తెలిపారు. మరి డబ్బు గురించి ఎవరితో పంచుకోవద్దో ఇప్పుడు తెలుసుకుందాం. అత్యాశ కలిగినవారితో.. అత్యాశగల వ్యక్తులను నమ్మడానికి వీలు లేదు. ఇలాంటి బుద్ధి కలిగిన వారు ఎక్కడికి వెళ్లిన అదే దృక్పథంలో ఉంటారు. ఇలాంటి వారితో మీ సంపాదన గురించి అస్సలు చెప్పొద్దు. ఎందుకంటే అలాంటి బుద్ది కలిగిన వారు.. మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. తద్వారా మీరు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే అత్యాశ కలిగిన ప్రజల ముందు డబ్బు, వ్యాపార విషయాల గురించి ఎప్పుడూ చెప్పొద్ద...

జీవితంలో సమస్యలు చుట్టుముడితే ఏమి చెయ్యాలో చాణుక్యుడు చెప్పిన అద్భుతమైన నీతి కథ

తక్షశిల విశ్వవిద్యాలయం పురాతన భారతదేశపు అత్యున్నత విద్యాలయాలలో ఒకటి. ఇందులో చదివినవాళ్ళు దేశంలోనే గొప్ప రాజులుగా ప్రసిద్ధిగాంచారు.  చాణుక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యను బోధించేవారు.. ఈ నేపథ్యంలో తన విద్యార్థులకు ఒక నీతి కథను చెప్పాడు..  ఒక అడవి లో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది. అది నిండు గర్భిణి.దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి. అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది. ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది . దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది. అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది. నొప్పులు మొదలయ్యాయి. నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి.   ఉరుములు, పిడుగులు. పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది.  దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం వస్తోంది. ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు. భగవాన్ ! ఆ లేడి ఇప్పుడు ఏమి చెయ్యాలి ? ఏమి జరగబోతోంది ? లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా ? బిడ్డ బతుకుతుందా? సింహం లేడిని తినేస్తుందా? వేటగాడు లేడిని చంపెస్తాడా ? నిప్పు లేడి వరకూ వచ్చి లేడి కూన...

మహాభారతంలో మనకు తెలియని రహస్యాలు ఇవే..

సంగ్రామాల జ్వాల ఇదే.. విశ్వ సైన్యాల స్ఫూర్తి ఇదే.. ధర్మము.. అధర్మము.. ఆది.. అనంతము.. ఇలా మహాభారతం గురించి మనం ఎన్ని విధాలుగా మనసులో తలచుకున్నా, మన ముందు మహాభారతం జరుగుతుందేమో అన్న భ్రమలోనే ఉండిపోతాము. ఈ మహా భారతం కథను ఎన్ని సార్లు చదివినా లేదా ఎన్నిసార్లు విన్నా, విన్న ప్రతిసారి లేదా చదివిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాము. అదే ఈ మహాభారతం యొక్క మహా అద్భుతం. అయితే ఇంతటి అద్భుతమైన కథలో మనకు తెలియని రహస్యాలు కూడా ఉన్నాయి. అయితే ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. మహాభారతంలోని ద్రోణాచార్యునికి సంబంధించిన ఒక ఇతివృత్తం తెలుసుకుందాం. ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి పుత్రుడు.  ద్రోణాచార్యుడు తల్లి ఒక అప్సరస. ఒకానొక సమయంలో సాయం కాలం భరద్వాజుడు స్నానం చేయడానికి గంగా నది తీరానికి వెళ్ళాడు.. అక్కడ స్నానం చేస్తున్న ఒక అప్సరస అందాన్ని చూసి మంత్రముగ్ధుల్ని అయ్యాడు. ఇక అప్పుడు భరద్వాజుడు అతని శరీరం నుంచి విడుదలైన ఒక శుక్రకణాన్ని ఒక కుండలో ఉంచి, దానిని చీకటిగదిలో భద్రపరుస్తారు. దీని నుంచి ద్రోణాచార్యుడు జన్మించినట్లు మహాభారతంలో చెప్పబడింది.కానీ పెద్దగా ప్రాముఖ్యతను సంతరించుకొనబడల...

ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే.. మహాభారతంలోని ఓ చిన్న కథ ఉదాహరణగా

మనిషి జీవితంలో రోజూ జరిగే సంఘటనలను రామాయణ, మహాభారత పురాణకథల్లో ప్రతిబింభిస్తాయి.  మానవుడు ఎలా బతకాలి.. ఎలా జీవించాలో రామాయణం మనకు నేర్పితే.. అదే మనిషి ఎలా జీవించకూడదు అనే విషయంతో పాటు.. రాజకీయం.. దేశ పాలన వంటి అనేక విషయాలకు మహాభారతం దిక్చుచిగా నిలుస్తుంది అని పెద్దలు అంటారు.  మహాభారతం అంటే ద్రౌపతి వస్త్రాభరణం, కురుక్షేత్రం లు ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. కానీ నిజానికి ఈరోజు దేశ రాజకీయ నేతలు అనుచరిస్తున్న ఉచితం అనే విధానాన్ని అద్దం పట్టేలా ఓ కథ ఉంది. పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేశాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు గర్వంగా భావిస్తుండేవాడట.  ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.  ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది. అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్ళు ఇచ్చింది. వారు తాగేశాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా ...