పరమాచార్య స్వామి వారి వాక్కు వేద వాక్కు
వారిది వేద వాక్కు ధనవంతుడైన పి.యస్. శివస్వామి అయ్యర్ చెన్నైలో ప్రముఖ న్యాయవాది. మంచి పేరు ప్రఖ్యాతులు గడించినవారు. అతని భార్య పేరు కళ్యాణి. వారి కట్టుకున్న ఇంటి పేరు ‘సుధామ’. అప్పట్లోనే అది చాలా పెద్ద భవనం. ఒకసారి మహాస్వామి వారు చెన్నైలో మకాం చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఒకరోజు స్వామి వారు ‘సుధామ’కు వచ్చి శివస్వామి దంపతులను ఆశ్చర్యానందాలకు గురిచేసారు. ఆ దంపతులకు పిల్లలు లేరు. పరమాచార్య స్వామివారు ఆ విషయం విని, “మీకు స్వంత పిల్లలు లేకపోతేనేమిటి? ఎంతోమంది పేదపిల్లలకు తల్లితండ్రులు అవ్వండి. నీ న్యాయవాద వృత్తిలో ధర్మమార్గంలో బ్రతుకుతూ న్యాయార్జితమైన నీ సంపాదనతో విద్యాశాలలను స్థాపించి జ్ఞానదానం చెయ్యి. నీ పేరు ఎప్పటికి నిలిచిపోతుంది. అలాగే, నీ ధర్మపత్ని పేరుమీద ఎందరో పిల్లలకు జన్మనిచ్చేదిగా ఒక ప్రసూతి ఆసుపత్రి కట్టించి నీ భార్య పేరు పేరు కూడా స్థిరపడేట్టు చెయ్యి” అని సెలవిచ్చారు. పరమాచార్య స్వామివారి ఆజ్ఞని శివస్వామి అయ్యర్ శిరసావహించారు. వారి భవ్యమైన భవనం ‘సుధామ’ను అమ్మేసి సుల్లివన్ గార్డేన్ రోడ్డ్డులో ఒక చిన్న ఇంటిని కొనుక్కుని అందులోకి మారారు. ఎడ్వర్డ్ ఎల్లియొట్స్ రోడ్డు(ఇప్పడు డా. రాధ...